- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిటికీ దగ్గర ఏం జరిగింది?.. వైరల్ అవుతున్న వెన్నెల కిశోర్
భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు.

దిశ, సినిమా : భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చేస్తూనే డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్ దృష్టిని లాగేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా వదిలిన పోస్టర్‌లో వెన్నెల కిషోర్ ఏదో అయోమయంలో పడినట్లు కనిపిస్తుండగా.. కిటికీ దగ్గర ఏం జరిగింది అని పోస్టర్‌పై రాసి ఇంకాస్త క్యూరియాసిటీ పెంచారు. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ఖచ్చితంగా ఫుల్ ఫన్ ఉంటుందని, గతంలో ఏ సినిమాలో కూడా చూడని డిఫరెంట్ సీన్స్ ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు సినిమాను నిర్మిస్తుండగా.. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు.






