- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vennela Kishore: త్రివిక్రమ్ గారి వల్లే ఈవెంట్‌కు వచ్చాను
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ... ఈరోజు కూడా నేను, సత్య, త్రివిక్రమ్ గారి సినిమా షూటింగ్‌లో ఉన్నాము. ఈవెంట్ ఉందని చెప్పడంతో ఆయన త్వరగా షూటింగ్ పూర్తి చేసి మమ్మల్ని పంపించారని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కమెడియన్లలో వెన్నెల కిషోర్ ఒకరు. ఈయన వరుస సినిమాల్లో నటిస్తూ అత్యంత బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నటుడు తాను నటించిన సినిమా ఈవెంట్లకు రారని, ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనరని ఈయనపై ఒక అపవాదు ఉంది. కాకపోతే ఈయన టైమ్ బిజీ వల్లనే తాను రాలేనని, అంతకుమించి రాకూడదనే ఎలాంటి ఉద్దేశం ఉండదని గతంలో ఈయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సత్య హీరోగా రితీష్ రానా దర్శకత్వంలో ‘జెట్లీ’ అనే సినిమా రూపొందింది. ఈ మూవీని మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిన్న నిర్వహించారు. దానికి సత్యతో పాటు వెన్నెల కిషోర్ కూడా అటెండ్ అయ్యారు.
ఈ ఈవెంట్‌లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ… “నేను చాలా బిజీగా ఉండడం వల్లే ఈవెంట్లకు రాలేను, అంతే తప్ప మరే కారణం లేదు. ఈరోజు కూడా నేను త్రివిక్రమ్ గారి సినిమా షూటింగ్‌లో ఉన్నాను. నాతో పాటు సత్య గారు కూడా అందులో నటిస్తున్నారు. మేమిద్దరం త్రివిక్రమ్ గారిని ‘సార్, ఈవెంట్ ఉంది, మమ్మల్ని త్వరగా పంపించండి’ అని అడగడంతో, ఆయన ఎంతో పెద్ద మనసుతో మా సన్నివేశాలను త్వరగా పూర్తి చేసి పంపించారు. ఆయన మాకు అంతగా సపోర్ట్ చేసి ఉండకపోతే ఈరోజు కూడా నేను ఈ ఈవెంట్‌లో ఉండేవాడిని కాదు” అని వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చారు.






