హీరోయిన్ సమంతపై వెన్నెల కిషోర్ ఫైర్.. లైవ్‌లో కోపం తెచ్చుకున్న షాకింగ్ వీడియో వైరల్

by Gantepaka Srikanth |

నటుడు వెన్నెల కిశోర్ కమెడీయన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

హీరోయిన్ సమంతపై వెన్నెల కిషోర్ ఫైర్.. లైవ్‌లో కోపం తెచ్చుకున్న షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: నటుడు వెన్నెల కిశోర్ కమెడీయన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాల్లో మెయిన్ లీడ్‌లో నటిస్తూ సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగా వెన్నెల కిశోర్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే సమంత నిర్మాణంతో తెరకెక్కుతోన్న ‘శుభం’ చిత్రం కూడా మే 9న రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.

ఈ క్రమంలోనే సమంత కూడా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే వెన్నెల కిశోర్, సమంత వీడియో కాల్ మాట్లాడుకున్నట్లు.. ప్రజెంట్ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో.. సమంత మాట్లాడుతూ.. ‘కిశోర్ ‘శుభం’ సినిమా చాలా బాగా వచ్చింది.. రిలీజ్ అయ్యాక నువ్వు నన్ను నిజంగా మెచ్చుకుంటావు.. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది’ అని తెలుపుతూ.. వెన్నెల కిశోర్ తన ‘సింగిల్’ మూవీ గురించి చెప్తుండగా వినకుండానే సమంత కాల్ కట్ చేస్తుంది. కిశోర్ మాట్లాడుతూ.. నా సినిమా ‘సింగిల్’ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.. నేను చెప్పేది విను.. సామ్ సామ్.. అంటాడు ఇంతలో సమంత కాల్ కట్ చేస్తుంది. దీంతో కిశోర్ సీరియస్‌గా నీ గోల నీదే ఎవడిది పట్టించుకోవా అని అంటాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story