తెలుగుదనం ఉట్టిపడేలా రెడీ అయిన వెంకీ హీరోయిన్.. చాలా బాగున్నారు అని నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగుదనం ఉట్టిపడేలా రెడీ అయిన వెంకీ హీరోయిన్.. చాలా బాగున్నారు అని నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పట్టు శారీ కట్టుకొని, కొప్పు పెట్టుకుని, మల్లెపూలు కూడా పెట్టుకుంది.

అలాగే సింపుల్‌గా ఒక చేతికి బ్యాంగిల్ మరో చేతికి బ్రేస్‌లెట్ వేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. మెడలో హారం, వడ్డానంతో కళకళలాడిపోతోంది. ఇక వాటికి.. ‘నువ్వు చేయగలవని నమ్ముతున్నాను, సగం దూరం వెళ్ళగలను’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ వావ్ అచ్చ తెలుగు అమ్మాయిలా చాలా బాగున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story