టాలీవుడ్ కు చెందిన ఇద్దరు హీరోలతో వెంకీ మామ సినిమా ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామానాయుడు వారసత్వాన్ని

టాలీవుడ్ కు చెందిన ఇద్దరు హీరోలతో వెంకీ మామ సినిమా ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలో స్టార్ మోస్ట్ హీరోగా మారిపోయారు వెంకటేష్. ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు ఆయన గట్టి పోటీ ఇస్తూ ఉంటారు. విక్టరీ వెంకటేష్ సినిమా వచ్చిందంటే మినిమం గ్యారంటీ ఉంటుంది.

మన సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఇండస్ట్రీని మొత్తం షేక్ చేశారు విక్టరీ వెంకటేష్. అయితే ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో వెంకటేష్ తర్వాత సినిమా ఏది అనే అంశంపై సోషల్ మీడియాలో... చర్చ జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా విక్టరీ వెంకటేష్ స్పందించారు. NATS కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ... తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో అని క్లారిటీ ఇచ్చేశారు.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. మళ్లీ మీనాతో కలిసి దృశ్యం తీయబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి తో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా రాబోతుందని తెలిపారు. నా స్నేహితుడు బాలయ్యతో బిగ్గెస్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నామని వివరించారు వెంకటేష్.

Next Story