అన్ కండీషనల్ లవ్‌గా ‘ప్రేమిస్తున్నా’

by Chukka Sudharani |

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త ప్రేమకథ ‘ప్రేమిస్తున్నా’.

అన్ కండీషనల్ లవ్‌గా ‘ప్రేమిస్తున్నా’
X

దిశ, సినిమా: వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త ప్రేమకథ ‘ప్రేమిస్తున్నా’. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ... ''ప్రేమిస్తున్నా ట్రైలర్ బాగుంది. నవంబర్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ అయ్యి.. సాత్విక్ వర్మ, ప్రీతీ నేహకు మంచి పేరు రావాలని కోరుకుంటున్న. దర్శకుడు భనుకు, నిర్మాత కనకదుర్గారావుకి నా బెస్ట్ విషెస్’ అన్నారు. దర్శకుడు భాను మాట్లాడుతూ.. ‘అన్ కండీషనల్ లవ్‌తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్‌తో ఏ సినిమా రాలేదు. అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్‌తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ. మేము విడుదల చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాను కూడా అదే రేంజ్‌లో సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.

Next Story