- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ది పారడైజ్ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ తో నాని సినిమా?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ది పారడైజ్ సినిమాలో.. గతంలో ఎప్పుడూ కనిపించని లుక్ లో నాని కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
ది పారడైజ్ షూటింగ్ పూర్తికాగానే ఏప్రిల్ 2026 నుంచి సుజిత్ డైరెక్షన్లో మరో యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ షురూ కానుంది. ఈ క్రమంలో నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. SIR సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి నానికి ఒక స్టోరీ చెప్పగా.. ఆల్ మోస్ట్ ఈ సినిమాకు నాని ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. స్టోరీపై చర్చలు ఫైనల్ కు చేరాయని, ఈ ప్రాజెక్టుపై నాని అధికారిక నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఓకే అయితే సుజిత్ సినిమా పూర్తవ్వగానే సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ తో కూడా మరో సినిమాకోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు ఓకే అయితే నెక్స్ట్ ఇయర్ నాని నుంచి 2-3 సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా.. వెంకీ ప్రస్తుతం సూర్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మేలో విడుదల కానుంది.






