బ్లాక్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న వెంకటేష్ మాజీ లవర్.. చూపులతోనే చంపేస్తున్నావుగా అంటూ కామెంట్స్

by I. Sairam |

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బ్లాక్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న వెంకటేష్ మాజీ లవర్.. చూపులతోనే చంపేస్తున్నావుగా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు.

ప్రస్తుతం నాగ చైతన్య సరసన ఎన్‌సి-24 సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టి చిత్రంలో నటిస్తోంది. మరోపక్క మీనాక్షి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో గత్తరలేపుతోంది. కొంటె చూపులతో చూస్తూ కిక్కెక్కిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు చూపులతోనే చంపేస్తున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story