- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టు లంగాఓణీలో ఆహా అనిపిస్తున్న వెంకటేష్ మాజీ ప్రియురాలు.. దేవకన్య అంటూ కామెంట్స్(పోస్ట్)
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ఈ భామ నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ కావడంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకుంది. తాను నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్న నేపథ్యంలో మీనాక్షి లక్కీ హీరోయిన్ అయిపోయింది.
రీసెంట్‌గా నటించిన 'అనగనగా ఒకరాజు' మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ అక్కినేని హీరో నాగ చైతన్య సరసన 'ఎన్‌సీ-24' మూవీతో పాటు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది. అలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది మీనాక్షి. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా మీనాక్షి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు ఎల్లో, మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న లంగా ఓణీలో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది. వెస్ట్రన్ వేర్ లోనే కాకుండా ఇటు ట్రెడిషనల్ వేర్ లోనూ మీనాక్షి చూడముచ్చటగా అనిపించింది. నవ్వుతూ మైమరిపించింది. ఇక వీటికి.. ‘కొంచెం నాటీ.. కొంచెం స్వీట్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు దేవకన్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






