- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Venkatesh : 25 కథలను రిజెక్ట్ చేసిన వెంకటేష్.. ఎందుకంటే ?
సంక్రాంతికి పండగకు వచ్చిన వెంకీ మామ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి రికార్డ్స్ బ్రేక్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : వెంకటేష్ ( Venkatesh ) హీరోగా నటించిన " సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki Vasthunam) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సంక్రాంతికి పండగకు వచ్చిన వెంకీ మామ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. వారందరూ థియేటర్లోకి వెళ్ళడంతో కాసుల వర్షం కురిసింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం మొత్తం రూ. 300 కోట్ల గ్రాస్‌కు పైగా కలెక్ట్ చేసింది. అయితే, ఈ మూవీ హిట్ ఇచ్చిన కిక్‌తో హీరో వెంకటేష్ ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై చేసే ప్రాజెక్ట్ ఏదైనా హిట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు.
అలా.. సంక్రాంతికి వస్తున్నాం విడుదల తర్వాత, ఇప్పటికి 25కు పైగా కథలు విని నో చెప్పినట్లు టాక్ నడుస్తోంది.అయితే, వాటిలో ఒక్కటి కూడా వెంకి మామకు నచ్చలేదు. కథలో కొంచం అటు ఇటుగా ఉన్నా ఎంత పెద్ద డైరెక్టర్ అయిన మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది.
F2, F3 సినిమాల తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో " సైంధవ్ " అనే మూవీ చేశాడు. ఆ చిత్రం వెంకటేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదని " సంక్రాంతికి వస్తున్నాం " సినిమా లాంటి సక్సెస్‌ను మళ్ళీ చూడాలని డిసైడ్ ఐనట్లు తెలుస్తుంది. కానీ, తన దగ్గరికి వస్తున్న ఏ కథ కూడా ఆయన్ను మెప్పించకలేకపోతుంది.
యంగ్ డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ల వరకు కథలు చెబుతున్నా ఎవరికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్. లేట్ అయినా పర్లేదు, మరో మంచి హిట్ సినిమాతోనే వస్తాడట. 300 కోట్ల రీజినల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసే చిత్రానికి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే లెక్కలు మొత్తం మారిపోతాయ్. వెంకీ మామ తీసుకున్న నిర్ణయంలో కూడా ఓ అర్థం ఉందని అభిమానులు కూడా అంటున్నారు. మరి, చివరికి ఎలాంటి కథకి ఓకే చెప్తారో చూడాల్సి ఉంది.






