sankranthiki vasthunnam: డైరెక్టర్ అనిల్‌పై వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

by Chukka Sudharani |

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’

sankranthiki vasthunnam: డైరెక్టర్ అనిల్‌పై వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
X

దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vasthunnam). సంక్రాంతి స్పెషల్‌గా ఈ మూవీ జనవరి 14 న గ్రాండ్ రిలీజ్‌ (Grand release)కు సిద్ధంగా ఉంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ (family entertainer)గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ (Cine lovers) ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ (Promotions)లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించి మ్యూజికల్ నైట్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా వెంకటేష్ డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి అనిల్ సూపర్ (Super) కథను ఇచ్చారు. ఈ స్క్రిప్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను ఎలా చేయాలో అనిల్ యాక్ట్ చేసి చూపించేవాడు.. అసలు అనిల్‌ని ప్రేక్షకులు స్క్రీన్‌లో చూస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడిని హీరోగా బిగ్ స్క్రీన్‌ (Big screen)పై చూడాలని వెంకీ చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ గ్రాండ్‌గా నిర్మించారు. ఫైనల్‌గా ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story