Venkatesh: సినీ ప్రేక్షకులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన వెంకీ మామ.. 2027 లో కూడా..!

by Kodari Anjali |

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాతికి వస్తున్నాం’ చిత్రం ఈ ఏడాది (2025) సంక్రాంతి పండుగ రోజున విడుదల అయి.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Venkatesh: సినీ ప్రేక్షకులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన వెంకీ మామ.. 2027 లో కూడా..!
X

దిశ, వెబ్‌డెస్క్: అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankrathiki vastunnam) చిత్రం ఈ ఏడాది (2025) సంక్రాంతి పండుగ రోజున విడుదల అయి.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో ఇది ఒకటి. ఇక కలెక్షన్ల విషయం చెప్పనవసరం లేదు. మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి ఫేస్టివల్‌కు రిలీజ్ అయిన ఈ మూవీ ఇన్ని డేస్ వరకు థియేటర్లలో ఆడటం అంటే నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు.

ఇక బెస్ట్ ఫార్మామెన్స్ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్(Tollywood senior hero Venkatesh) ఇందులో కథానాయకుడిగా నటించారు. అలాగే మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కథానాయకులుగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఊహించని విధంగా సినిమా భారీ హిట్ కొట్టడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీలు జరుపుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం(Sri Venkateswara Creations)పై శిరీష్ నిర్మించిన ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను సోమవారం(ఫిబ్రవరి 10) హైదరాబాదులో రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్ కు హరీశ్ శంకర్, టాలీవుడ్ స్టార్ సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావు, వంశీ, వశిష్ఠ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే సాంకేతిక బృందం, పంపిణీదారులు, ప్రదర్శనకారులకు జ్జాపికలు అందజేశారు.

అయితే ఈ సందర్భంగా నటుడు వెంకటేష్ మాట్లాడారు. దేవుడా ఓ మంచి దేవుడా అని ఫన్నీగా స్వీచ్ మొదలు పెట్టి అందరినీ నవ్వించారు. ఆయన మొదటి చిత్రం కలియుగ పాండవులు సినిమా సక్సెస్ ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినీ ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కృతజ్జతలు తెలియజేశారు. మంచి కంటెంట్ ఉంటే చాలు జనాలు సినిమాను ఎక్కడికి అయినా తీసుకెళ్తారని అన్నార. డైరెక్టర్ రాఘవేంద్రరావు (Director Raghavendra Rao)ఎప్పటినుంచో ఒకటి అంటున్నారని.. ఓ మంచి ఫ్యామిలీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనేవారు.

అది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో నిజమైందని వెల్లడించారు. మూతబడిన థియేటర్లు కూడా కళకళలాడాయని వెంకీ చెప్పుకొచ్చారు. మూవీ టీమ్ మొత్తం బాగా నటించారని.. మళ్లీ 2027 లో మళ్లీ సంక్రాంతికి వస్తామంటూ అన్నారు. మరీ రికార్డులు బద్దలు కొట్టడానికేం కాదండీ.. జనాల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. అదే మాకు ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం హీరో వెంకటేష్ కామెంట్స్ విన్న అభిమానులు ఎగిరిగంతులేస్తున్నారు.

Next Story