- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీరభద్రుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు
వీరభద్రుడు మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను మే 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: సూర్య తాజాగా నటించిన చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ మూవీని తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ వేడుకను రేపు, అనగా మే 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈరోజు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మే 14న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేయనుంది.






