- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VD14 : 'రణబాలి' గా విజయ్ దేవరకొండ..ఇక రచ్చ రచ్చే
విజయ్ దేవరకొండ సినిమాకు రణబలి అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మేరకు గ్లింమ్స్ వదిలింది చిత్ర బృందం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఓ సినిమా లేదా రెండు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. VD14 మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ వచ్చేసింది. ఈ సినిమాకు 'రణబాలి' అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మేరకు టీజర్ వదిలింది చిత్ర బృందం.
ఈ టీజర్ లో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయినట్లు చూపించారు. బ్రిటీష్ కాలంనాటి పోరాటాలపై సినిమా తీసినట్లుగా టీజర్ చూస్తే కనిపిస్తోంది. అటు ఓ వీరుడిలాగా విజయ్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి జోడీ కడుతున్నారట. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది.






