‘తెలుసు కదా’ మూవీ నుంచి వరుణ్ పోస్టర్ రిలీజ్.. వెయిటర్‌ లుక్‌లో అదిరిపోయాడంతే..

by I. Sairam |

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’(Telusu Kada).

‘తెలుసు కదా’ మూవీ నుంచి వరుణ్ పోస్టర్ రిలీజ్.. వెయిటర్‌ లుక్‌లో అదిరిపోయాడంతే..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’(Telusu Kada). నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వైవా హర్ష(Viva Harsha) కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న తెలుగు, తమిళం, కన్నడలో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

ఇక అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్‌డేట్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే సిద్ధు ఈ చిత్రంలో వరుణ్(Varun) పాత్రలో కనిపించనున్నారు. ఇక పోస్టర్‌లో హీరో వెయిటర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఓ టేబుల్ మీద కూర్చోని తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చాలా క్యూట్‌గా చూస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story