- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొణిదెల వారింటికి తొలి మెగా వారసుడొచ్చాడోచ్.. వరుణ్ తేజ్‌కు ఫ్యాన్స్ ఫస్ట్ డిమాండ్ అదే..
సెప్టెంబర్ 10న రెయిన్ బో ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారసుడు పుట్టాడన్న విషయం తెలిసిన చిరంజీవి..

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోకి తొలి వారసుడొచ్చాడు. తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య (Varun Tej - Lavanya) దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. దీంతో మెగా వారసుడొచ్చాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు, మెగాస్టార్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లు అన్నదమ్ములన్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి కూతుర్లు, కొడుకులు ఉన్నారు. వరుణ్ తేజ్, నిహారిక, సుష్మిత, శ్రీజ, రామ్ చరణ్, అకీరానందర్, ఆద్య, పవన్ మూడో భార్య పిల్లలు.. వీరంతా రెండో తరం కిందికి వస్తారు. మెగా వారి మూడో తరం చూస్తే.. చిరంజీవి ఇద్దరు కూతుర్లకు కూతుర్లే పుట్టారు. అయినా కూతుర్ల పిల్లలు వారసులు కారు అంటారు కదా.
రామ్ చరణ్ - ఉపాసన (Ram Charan - Upasana) దంపతులకు పెళ్లైన పదకొండేళ్లకు తల్లిదండ్రులయ్యారు. 2023 జూన్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటి వరకూ కూతురి ముఖాన్ని రివీల్ చేయలేదు ఈ జంట. చిరంజీవి కూతుర్లతో పాటు.. రామ్ చరణ్ కు కూడా కూతురే పుట్టడంతో ఫ్యాన్స్ కాసింత నిరాశ చెందారు. కూతురు, కొడుకు అన్న తేడా లేకుండా.. ఎంత ఈక్వల్ గా చూసినా.. కొడుకులనే వారసులుగా పరిగణిస్తారు కదా. ఇక నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిని ప్రేమించి.. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2023 నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ ఏడాది మే నెలలో తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన ఈ జంట.. ఇటీవల వినాయకచవితికి పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షించింది. ఆ ఫొటోలో లావణ్య నిండు గర్భంతో కనిపించింది.
సెప్టెంబర్ 10న రెయిన్ బో ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారసుడు పుట్టాడన్న విషయం తెలిసిన చిరంజీవి.. మన శంకర వరప్రసాద్ గారు సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి బిడ్డను, వరుణ్ - లావణ్యలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా మెగా వారింటికి మూడోతరం వారసుడొచ్చాడు.. మరో మెగా హీరో పుట్టాడని ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఇదీ సంగతి.. వరుణ్ తేజ్ కొడుకు మూడో తరానికి తొలి వారసుడిగా నిలిచాడన్నమాట. అయితే.. రామ్ చరణ్ దంపతుల్లా ముఖాన్ని దాచకుండా.. త్వరగా రివీల్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. వారసుడి రాకతో మెగావారింట సంబరాలు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే.. క్లీంకార నామకరణంలో ఎన్నో జాగ్రత్తలు పాటించిన మెగా కుటుంబం.. వారసుడికి ఏ పేరు పెడతారోనని అప్పుడే చర్చ కూడా మొదలైంది.
Read More: చిరంజీవి చేతిలో మెగా వారసుడు.... అదిరిపోయే ఫోటోలు వైరల్






