- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vithika Sheru: రాత్రి పూట రోడ్ మీద వరుణ్ సందేశ్ భార్య హాట్ ఫోటో షూట్ .. ఇలా మారిపోయిదేంటి అంటూ నెటిజన్ల కామెంట్స్
కారు పక్కన పెట్టి రాత్రి పూట రోడ్డు మీద హాట్ ఫోటో షూట్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ ( Heroines ) గ్లామర్ మీదే దృష్టి పెట్టారు. ఖాళీ సమయంలో స్టైలిష్ లుక్ లో రెడీ అయ్యి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు డోస్ పెంచి హాట్ హాట్ గా ముస్తాబై హాట్ ఫోజులుతో రెచ్చి పోతున్నారు. ఒకర్ని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు, తాజాగా ఆ లిస్ట్ లో ఓ టాలీవుడ్ హీరో సతీమణి కూడా చేరిపోయింది.
పెళ్లికి ముందు కొన్ని సినిమాల్లో మెప్పించిన ఈ హీరోయిన్ గా పెళ్లి తర్వాత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇక మెల్లిగా సినిమాలకు ( Movies ) దూరమైపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఆమె అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంది. తన లేటెస్ట్ గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు ( Hot Photos) నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాత్రి పూట కారు పక్కన పెట్టి రోడ్డు మీద హాట్ ఫోటో షూట్ చేస్తోంది. వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు బాగానే ఉంది కదా .. సడెన్ గా ఇలా మారిపోయిందేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అందాల భామ ఎవరో కాదు తెలుగు హీరో వరుణ్ సందేశ్ ( Varun Sandesh ) భార్య వితికా షేరు ( Vithika Sheru ) " పడ్డానండి ప్రేమ " మూవీ షూటింగ్ సమయంలోనే వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది వితిక. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2019లో టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss 3 ) తెలుగు సీజన్ 3 లో ఇద్దరూ సందడి చేశారు. ప్రస్తుతం, ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటోంది వితికా షేరు.






