- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varun Sandesh: వన్ వే టికెట్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా హీరోయిన్
డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో, విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు వరుణ్ సందేశ్.

దిశ, సినిమా: డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో, విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు వరుణ్ సందేశ్. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వన్ వే టికెట్’. ఏ.పళవి స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు వచ్చిన ముఖ్య అతిథులు నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమానికి టీ ఎస్ రావు అతిథిగా విచ్చేశారు. ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్ సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీని కుష్బూ చౌదరిని ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. హీరోయిన్‌కు ఫిదా అవుతున్నారు యూత్.






