ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వర్షం రీ-రిలీజ్ కు డేట్ ఫిక్స్ !

by Veldandi saikiran |   ( Updated:2025-04-13 13:05:21.0  )
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వర్షం రీ-రిలీజ్ కు డేట్ ఫిక్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ ( Prabhas) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రభాస్ అలాగే త్రిష ( Trisha ) జంటగా నటించిన వర్షం సినిమా ( Varsham movie ) రీ రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టులు కూడా ప్రభాస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ అలాగే హీరోయిన్ త్రిష జంటగా నటించిన వర్షం సినిమాను... మే 23వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ ( Varsham4K Re-Releasing ) చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై అధికారిక ప్రకటన ఎక్కడ రాకపోయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని వైరల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే ప్రభాస్ లాంటి సినిమా రీ రిలీజ్ అయితే కలెక్షన్లు కూడా.. భారీగానే వస్తాయి. ఇది ఇలా ఉండగా హీరో ప్రభాస్ అలాగే త్రిష జంటగా నటించిన వర్షం సినిమా 2004లో వచ్చింది.

ఆ సమయంలో రిలీజ్ అయిన వర్షం సినిమా... తెలుగు ప్రేక్షకులను బాగా నే ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించారు. ఎమ్మెస్ రాజు నిర్మాతగా కొనసాగారు. ఇక ఈ సినిమా లో గోపీచంద్ విలన్ గా ఉండటం గమనార్హం. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను... తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు.



Next Story

Most Viewed