వారణాసి సినిమా: ఏకంగా 5 పాత్రల్లో మ‌హేష్‌బాబు

by Gantepaka Srikanth |

వారణాసి సినిమా: ఏకంగా 5 పాత్రల్లో మ‌హేష్‌బాబు

వారణాసి సినిమా: ఏకంగా 5 పాత్రల్లో మ‌హేష్‌బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం వారణాసి. యావత్‌ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు, ఈ చిత్ర (Varanasi Movie) కథా నేపథ్యాన్ని తెలిపేలా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు ఏకంగా ఐదు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రెండు పాత్రల్లో నటించిన హీరోలు, మూడు పాత్రల్లో నటించిన హీరోలు ఉన్నారు.. కానీ.. ఏకంగా మహేశ్ బాబు ఐదు పాత్రల్లో నటించబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

Next Story