డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్.. అఫీషియల్ వీడియోతో హైప్

by I. Sairam |

నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharath Kumar) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్.. అఫీషియల్ వీడియోతో హైప్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharath Kumar) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నది హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తన నటనతో మెప్పించింది. మెయిన్‌గా తెలుగు సినిమాల్లో తన విలక్షణ నటనతో ఆహా అనిపించింది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ చిన్నది ఇప్పుడు డైరెక్టర్‌గా మారిపోయింది. ఇందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫస్ట్ సినిమాను ప్రకటించింది.

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో ‘సరస్వతి’(Saraswathi) అనే సినిమా రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాని వరలక్ష్మి తన సొంత బ్యానర్ ‘దోస డైరీస్’(Dosa Dairies) పై తన సోదరి పూజ శరత్ కుమార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్(Prakash Raj), ప్రియమణి(Priyamani) కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్(Taman) సంగీతం అందిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది.

ఇక వీడియోలో.. ‘కెమెరా.. యాక్షన్.. ఇంటి మీద వాలిన కాకి అనుకున్నావా, నేను ఊరిమీద వాలిన కాకిని’ అని పోలీస్ డ్రెస్‌లో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ అనగానే కట్ కట్ అంటూ డైరెక్టింగ్ చేస్తున్న వరలక్ష్మి అంటుంది. అప్పుడు యాక్టర్‌గా నాకు యాక్టింగ్ నేర్పిస్తున్నావా అని యాక్టర్‌ వరలక్ష్మి.. డైరెక్టింగ్ నాకు నేర్పిస్తున్నావా అని డైరెక్టర్ వరలక్ష్మి మాటామాటా అనుకుంటారు. అప్పుడు మీరిద్దరు వెళ్లి ఫస్ట్ ఏదో ఒకటి తేల్చుకొని రండి అని బ్యాక్ గ్రౌండ్ నుంచి ఓ వాయిస్ వస్తుంది. ఇక చివరిగా డైరెక్టర్ వరలక్ష్మి ‘ఇది నా ఫస్ట్ సినిమా.. సరస్వతి త్వరలోనే రిలీజ్ కానుంది.. అప్డేట్స్ కోసం వేచి ఉండండి’ అని చెప్పింది. దీంతో ఈ వీడియో అయిపోతుంది. మరి డైరెక్టర్‌గా ఈ చిన్నది ఎలా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

Next Story