‘వానర’ కాదు ‘వనవీర’..

by Sujitha Rachapalli |

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వనవీర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా, నందు ప్రతినాయకుడిగా కనిపించనున్న చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి

‘వానర’ కాదు ‘వనవీర’..
X

దిశ, సినిమా : అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వనవీర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా, నందు ప్రతినాయకుడిగా కనిపించనున్న చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడి అవినాష్ తిరువీధుల.. ‘అన్ని నిబంధన ప్రకారమే మా మూవీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాం. గతేడాది అనౌన్స్ చేశాం. ఇప్పుడు ఐదు రోజుల్లో రిలీజ్ ఉందనగా టైటిల్ మార్చమని చెబితే మాలాంటి చిన్న మూవీస్ ప్రొడ్యూసర్స్ ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. పబ్లిసిటీ మీద ఖర్చు చేశాం. హైదరాబాద్‌తో పాటు ఏపీలో ప్రమోషనల్ టూర్స్ చేశాం. ఇప్పుడు మీడియా మిత్రుల మీదే మా నమ్మకం పెట్టుకున్నాం. మీరే మా టైటిల్‌ను అందరికీ తెలిసేలా చేయాలి. కిరణ్ అబ్బవరం అన్నకు టైటిల్ వనవీర అని మార్చాం.. ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పగానే వెంటనే పంపించు చేస్తానని అన్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. కులం, రాజకీయాలు వంటి సున్నిత అంశాలున్న ఈ చిత్రానికి ఆ టైటిల్ సరికాదు అని సెన్సార్ వారు చెబుతున్నారు. మేము అంగీకరిస్తాం కానీ ముందే మాకు ఇలాంటి విషయాల గురించి అబ్జెక్షన్ చెప్పాల్సింది. ఒక హిట్ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. మా సినిమా నిరాశపరచదు అనే కాన్ఫడెన్స్‌తో ఉన్నాం’ అని తెలిపారు.

Next Story