- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్లాస్ దర్శకుడితో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ
"35 చిన్న కథ కాదు" సినిమాతో ప్రశంసలు అందుకున్న నంద కిషోర్ ఏమాని దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో ఒక్కసారిగా ఈయన ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. మొదటి సినిమాతో వచ్చిన గుర్తింపు ఆ తర్వాత ఆయనకు రాలేదు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం ఫెయిల్యూర్ అయింది.
కానీ ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది. తర్వాత వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగ రంగ వైభవంగా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక చివరగా వచ్చిన మాస్ మూవీ ఆది కేశవ డిజాస్టర్‌గా నిలిచింది. వరుసగా మూడు ప్లాప్స్ రావడంతో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు ఆయన కొత్త సినిమాపై స్పష్టమైన అప్‌డేట్స్ రాలేదు.
తాజాగా ఈ యంగ్ హీరో నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "35 చిన్న కథ కాదు" సినిమాతో ప్రశంసలు అందుకున్న నంద కిషోర్ ఏమాని దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ దర్శకుడు వైష్ణవ్ కోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే వీరి కాంబినేషన్‌లో ఓ మంచి ప్రాజెక్ట్ రావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.






