- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సినిమాలలో సార్ ఒకటి. హీరో ధనుష్ చేసిన సార్ మూవీ 2023 సంవత్సరంలో రిలీజ్ అయి, మంచి సక్సెస్ అందుకుంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ధనుష్ హీరోగా చేయగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. వెంకీ అట్లూరి ( Venky Atluri) దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
రూ. 65 కోట్లతో ఈ సినిమా తీస్తే రూ.100 కోట్లకు పైగా రాబట్టింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను మొదటగా హీరో రవితేజతో చేయాలని అనుకున్నారట వెంకీ అట్లూరి. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా సార్ సినిమాను రవితేజ వదులుకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వెంటనే ధనుష్ వద్దకు వెళ్లి కథ చెప్పడంతో ఓకే అయిందట. అదే రవితేజ ఈ సినిమా తీస్తే, మంచి బ్లాక్ బాస్టర్ అయ్యేది. అవకాశాన్ని రవితేజ పోగొట్టుకున్నారని టాక్.






