Ustad Bhagat Singh : నార్త్ అమెరికా డీల్ క్లోజ్

by Pulgam srinivas |

Ustad Bhagat Singh : ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించుకున్నట్లు, ప్రీమియర్లను మార్చి 25వ తేదీన ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

Ustad Bhagat Singh : నార్త్ అమెరికా డీల్ క్లోజ్
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా హక్కులను ఎవరు దక్కించుకున్నారు? అక్కడ ప్రీమియర్లను ఏ తేదీన ప్రదర్శించనున్నారు? అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించుకున్నట్లు, ప్రీమియర్లను మార్చి 25వ తేదీన ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయం తర్వాత పవన్, హరీష్ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో దీనిపై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.




Next Story