Ustad Bhagat Singh: సింధూరం డైలాగ్ ఇన్స్పిరేషన్ అదే.. హరీష్ శంకర్

by Pulgam srinivas |

హరీష్ శంకర్ మాట్లాడుతూ... మనదేశంలో ఆడవాళ్లు బొట్టు పెడతారు. అలాంటిది మన అమ్మ, అక్క, సోదరీమణుల సిందూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి, అంత విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ రాశాను అని ఈ దర్శకుడు చెప్పారు.

Ustad Bhagat Singh: సింధూరం డైలాగ్ ఇన్స్పిరేషన్ అదే.. హరీష్ శంకర్
X

దిశ, వెబ్ డెస్క్: హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నిన్న విడుదలైంది. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో బొట్టు పెట్టడం గురించి ఒక డైలాగ్ ఉంది. అందులో పవన్ కళ్యాణ్ "ఆడవాళ్లు బొట్టు పెట్టడం మన హిందూ సంప్రదాయం, కానీ ఒక మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా?" అనే డైలాగ్ ఉంది.

ఇది థియేటర్లో వచ్చినప్పుడు పవన్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఈ చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందులో ఈ డైలాగ్ ఎందుకు రాశానో దాని గురించి హరీష్ శంకర్ క్లియర్గా చెప్పారు. "మనదేశంలో ఆడవాళ్లు బొట్టు పెడతారు, ఉదాహరణకు ఏదైనా హోటల్ వెళ్తే క్రికెటర్లకి, వాళ్ళకి, వీళ్ళకి అక్కడ ఉన్న ఆడవాళ్లు బొట్టు పెడతారు. అలాగే ఇంట్లో ఎవరైనా కొత్త ఉద్యోగం కోసం బయలుదేరితే అమ్మో, అక్కో, చెల్లో బొట్టు పెడతారు.

ఇది మన భారతీయుల సంస్కృతి, సాంప్రదాయం. అలాంటిది మన అమ్మ, అక్క, సోదరీమణుల సిందూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి, పెద్ద విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ రాశాను. ఏదో జనాలను అలరించడం కోసం అప్పటికప్పుడు రాసిన డైలాగ్ కాదది. సినిమాలో హీరో పాత్ర భగత్ సింగ్ ఆశయాలతో పెరుగుతుంటాడు, తల్లితండ్రులు లేని ఆయన ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనేదానికి ఉదాహరణగా ఆ డైలాగ్ రాశాము" అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.

Next Story