- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ నల్ల నాగప్ప వచ్చేశాడు
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో మెరువనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh) అన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే చాలా అప్డేట్ వచ్చాయి. ఈ సమ్మర్ కు సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం.
పవన్ కళ్యాణ్ సినిమాలో డేంజర్ విలన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాన్ భగత్ సింగ్ సినిమాలో ( Ustaad Bhagat Singh) విలన్ పాత్ర కోసం వెర్సటైల్ యాక్టర్ పార్దిబన్ ( Parthiban Radhakrishnan ) మెరువనున్నారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇందులో నల్ల నాగప్ప ( NALLA NAGAPPA ) అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో అత్యంత భయంకరంగా నల్ల నాగప్ప కనిపించాడు.
ఓ పెద్ద బంగ్లాలో, ఇంటి పెద్దగా.. నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తుండగా శ్రీ లీల అలాగే రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో మెరువనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాలో సత్యదేవ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26వ తేదీన రిలీజ్ కానుంది.






