ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే సాంగ్‌..ఇక భూకంప‌మే

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:44:49  IST  )

పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వదిలింది చిత్ర బృందం. దేఖ్ లేంగే సాలా

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే సాంగ్‌..ఇక భూకంప‌మే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే శుభవార్త అందింది. పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వదిలింది చిత్ర బృందం. దేఖ్ లేంగే సాలా అంటూ సాగే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ కాంపోస్ చేసిన ఈ దేఖ్ లేంగే సాలా పాటను భాస్కర్ భ‌ట్ల‌ రాశాడు. విశాల్ దద్లానీతో ఈ పాటను పాడించారు. ఇక ఈ సాంగ్ ప్రోమోలో రంపంపం రంపంపం నేను సృష్టిస్తే భూకంపం అంటూ పవన్ కళ్యాణ్ వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇక కాసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ పాట క్షణాల్లోనే వైరల్ గా మారింది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh) సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తుండగా శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా చేస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వ‌స్తోంది.

Next Story