Urvashi Rautela: ఆసుపత్రి బెడ్‌పై తల్లి ఉంటే బాలయ్య బ్యూటీ అలాంటి పని.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) పలు తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో ఆడి పాడి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

Urvashi Rautela: ఆసుపత్రి బెడ్‌పై తల్లి ఉంటే  బాలయ్య బ్యూటీ అలాంటి పని.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) పలు తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో ఆడి పాడి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Balakrishna) ‘డాకు మహారాజ్’(Daaku Maharaj)సినిమాలో దంచుబాల సాంగ్‌కు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి, సైఫ్ దాడి గురించి అడగ్గా.. ‘డాకు మహారాజ్’ కలెక్షన్స్ గురించి చెప్పి దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా ఏ ప్రశ్న వేసినా, ఏ టాపిక్ అడిగినా ఈ మూవీ గురించే చెబుతూ వంద కోట్లు దాటిందని అంటుంది.

అలాగే కియారా నటించిన ‘గేమ్ చేంజర్’(Game Changer) ఫ్లాప్ అయిందని చెప్పింది. ఊర్వశి అతిని భరించలేక దండం పెట్టేస్తున్నారు. నార్త్ ఆడియెన్స్ సైతం ఆమె ఓవర్ యాక్షన్‌ను తిప్పి కొడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ పెట్టి మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తన తల్లి హాస్పిటల్‌లో ఉందన్న విషయం వెల్లడిస్తూ..ఆమె ఆరోగ్యం గురించి ప్రార్థించాలని వేడుకుంది. అయితే ఊర్వశి తల్లి బెడ్‌పై ఉండగా గాగుల్స్ పెట్టుకుని మరీ బాధ లేకుండా స్టైల్‌గా కనిపించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఏం నువ్వు ఈ పోస్ట్ ఎందుకు చేసావ్.. ఏం అడిగినా డాకు మహారాజ్ గురించే చెప్తావుగా అని అంటున్నారు. మర్చిపోయి మీ అమ్మకు ఈ మూవీ గురించి చెప్పావా ఏంటి అందుకే హాస్పిటల్‌లో జాయిన్ అయిందని కౌంటర్లు వేస్తున్నారు.

Next Story