- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
spirit: ప్రభాస్ స్పిరిట్‌లో ఉపేంద్ర.. ఒక్క పిక్‌తో కన్ఫార్మ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ ఒకటి.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ ఒకటి. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అనౌన్స్‌మెంట్ నుంచి మంచి ఇంపాక్ట్ ఉన్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించే నటులను ఒక్కొక్కరుగా రివీల్ చేస్తున్నాడు డైరెక్టర్. ఇందులో భాగంగా.. రీసెంట్ హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రిని కన్ఫార్మ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చెయ్యగా.. తాజాగా మరో నటుడుపై నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘యానిమల్’ సినిమాలో కనిపించింది కొంచెం సేపే అయినప్పటికీ తన పాత్రతో గట్టి ఇంపాక్ట్ చూపించిన నటుడు ఉపేంద్ర లిమాయె పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అప్పటి నుంచి ఈ నటుడు వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా మాస్ హిట్ అందుకున్న ‘జాట్’ సినిమాల్లో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు ఈయన మరోసారి సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సందీప్ భద్రకాళి ఆఫీస్‌లో మెగాస్టార్ మాస్ ఫ్రేమ్ ముందు తన బద్రర్‌తో కలిసి ఉపేంద్ర లిమాయె ఫొటో దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. డైరెక్టర్ సందీప్ ప్రభాస్‌తో చేయనున్న స్పిరిట్‌లో కూడా ఈ మాస్ నటుడు కనిపిస్తాడని టాక్ మొదలైంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






