ఒక సన్నివేశం మాత్రమే మిగిలి ఉంది.. మెగాస్టార్ చిరంజీవి సినిమాపై లేటెస్ట్ అప్డేట్

by Chukka Sudharani |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

ఒక సన్నివేశం మాత్రమే మిగిలి ఉంది.. మెగాస్టార్ చిరంజీవి సినిమాపై లేటెస్ట్ అప్డేట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘మెగా 157’ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ ట్రాక్‌తో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్, చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే షూటింగ్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

‘Mega157 షూటింగ్ దాదాపు 30 రోజులు పూర్తి చేశాము.. మొదటి సగం పూర్తి కావడానికి ఒక సన్నివేశం మాత్రమే మిగిలి ఉంది. సమ్మె మా మొత్తం షెడ్యూల్‌ను ప్రభావితం చేసింది. లేకపోతే మేము రెండవ భాగంలో రెండు సన్నివేశాలను పూర్తి చేయగలిగేవాళ్ళం’ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. లింక్

Next Story