- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi: భారీగా రామ్ చరణ్ ‘పెద్ది’ నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్.. లండన్‌కు గ్లోబల్ స్టార్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi).

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi). మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఉప్పెన్’ ఫేమ్ బుచ్చిబాబు సనా (Buchibabu Sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ (Glimpses) ఊహించని రేంజ్‌లో హైప్ పెంచేసింది. దీంతో రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ (Next schedule)కు భారీ ప్లాన్ వేశారట మేకర్స్. తదుపరి షెడ్యూల్‌ను లండన్(London)లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. అందుకోసం రామ్ చరణ్ కూడా లండన్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఫిలీమ్ వర్గాల నుంచి సమాచారం. కాగా.. ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 27 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
#RamCharan's #Peddi Next Schedule is Planned in London.
— Movie Tamil (@MovieTamil4) April 30, 2025
In Cinemas March 27, 2026 pic.twitter.com/0hYLgxNO0N






