అందుకే ఆలస్యం అవుతుంది.. పెద్ది ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషనల్ రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’.

అందుకే ఆలస్యం అవుతుంది.. పెద్ది ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషనల్ రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. స్పోర్ట్స్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ‘పెద్ది’ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో.. ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు ‘పెద్ది ఫస్ట్ సింగిల్ అయితే రెడీ గా ఉంది. కానీ సాంగ్ షూట్ చేసి లిరికల్ వీడియోలో యాడ్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఆలస్యం అవుతున్నది... సాంగ్ షూట్ అయ్యాకే విజువల్స్ యాడ్ చేసి వదులుతారు’ అని ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. ఫుల్ ఖుష్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. కాగా.. ఇదొక మంచి లవ్ సాంగ్‌గా తెలుస్తుండగా.. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story