- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డార్లింగ్ ఈజ్ బ్యాక్.. స్పిరిట్, కల్కి 2 షూటింగ్ అప్డేట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ స్పిరిట్ అండ్ కల్కి సీక్వెల్ షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నాడు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘కల్కి 2898AD’, ‘స్పిరిట్’ ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 9828ఏడీ’ 2024 లో వచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీక్వెల్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రస్తుతం కల్కి పార్ట్ 2కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుండగా.. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ‘కల్కి 2898AD’ షూటింగ్ మే 4 అనగా ఈరోజు నుంచి స్టార్ట్ అవ్వగా.. 7 వ తారీకు వరకు జరిగే షెడ్యూల్‌లో డార్లింగ్ పాల్గొంటున్నారు. అలాగే.. ఈ షూట్ పూర్తి చేసుకుని మే 10 నుంచి స్పిరిట్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వనున్నాడు’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతోన్న చిత్రం స్పిరిట్. భద్రకాళి పిక్చర్స్, ప్రొడక్షన్, టీ సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






