- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళంలో అనసూయ మూవీ.. ఎట్టకేలకు మరో అప్డేట్ ఇచ్చిన మేకర్స్
ప్రజెంట్ వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న అనసూయ.. తమిళ ఇండస్ట్రీ ఎంట్రీకి కూడా సిద్ధం అయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ప్రజెంట్ వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న అనసూయ.. తమిళ ఇండస్ట్రీ ఎంట్రీకి కూడా సిద్ధం అయిన విషయం తెలిసిందే. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఊల్ఫ్’. ఇందులో అనసూయతో పాటు లక్ష్మీ రాయ్ కూడా హీరోయిన్‌గా నటిస్తుంది. వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. అలాగే 2023 లో టీజర్‌ను కూడా రిలీజ్ చెయ్యగా.. మంచి స్పందనే వచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ రాలేదు.
దీంతో ఈ చిత్రం ఆగిపోయిందేమో అని అనుకున్నారు అంతా. ఈ క్రమంలోనే తాజాగా ‘ఊల్ఫ్’ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో ‘సాసాసా’ అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సాంగ్‌ను రిలీజ్ చేస్తూ.. మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌లో ప్రభుదేవాతో పాటు అనసూయ, లక్ష్మీరాయ్, అంజూ కురియన్ కన్నింగ్ లుక్స్‌లో చూస్తూ కనిపించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతూ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్. లింక్






