- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాసన తల్లి ఛాలెంజింగ్ ప్రయాణం.. ఏకంగా 60 ఏళ్ల వయసులోనే ఆ పనులు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జంటలలో... వీళ్ళిద్దరూ ముందు వరుసలో ఉంటారు. అటు ఈ మధ్యకాలంలోనే ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది. దీంతో మెగా కుటుంబంలో సందడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
మెగా కుటుంబంతో పాటు... ఉపాసన తల్లి గారి ఇంట్లో కూడా సందడి నెలకొంది. మెగా కుటుంబం కంటే ఎక్కువ ఆస్తులే ఉపాసన తల్లిదండ్రులకు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్త, ఉపాసన తల్లి పేరు శోభన కామినేని ( Sobhana kamineni) అన్న సంగతి తెలిసిందే. ఆమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక సేవలో భాగంగా అనేక పోస్టులు కూడా పెడుతూ ఉంటారు శోభన కామినేని.
అయితే... ఈ నేపథ్యంలోనే శోభన కామినేని... అరుదైన ఘట్టాన్ని పంచుకున్నారు. వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా.. ఆమె ఆసక్తికర పోస్టు షేర్ చేశారు. 2023 సంవత్సరంలో హైదరాబాదు నుంచి చెన్నై సైకిల్ రైడ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాదాపు 600 కిలోమీటర్ల పాటు సైకిల్ మీదే ఆమె వెళ్లారట. మోకాలికి ఆపరేషన్ అయినా, నెక్ లో ప్లేట్స్ ఉన్నా ఈ సాహస యాత్రను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. ఈ విషయాన్ని సైకిలింగ్ డే సందర్భంగా పంచుకున్నారు. అయితే ఉపాసన కూడా ఈ పోస్టుపై స్పందించారు. ఓ మై మదర్.. నీ ఛాలెంజ్ ల వల్ల నా ఒత్తిడి అంతా తగ్గిపోతుంది అంటూ.. తల్లిపై ప్రశంశల వర్షం కురిపించారు ఉపాసన.






