- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unni Mukundan: అలాంటి సీన్స్ సినిమాలో ఉండకూడదు.. అదే నా పాలసీ అంటున్న స్టార్ హీరో
మలయాళ (Malayalam) స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’

దిశ, సినిమా: మలయాళ (Malayalam) స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’ (Marco). హనీఫ్ (Hanif) డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 20 న థియేటర్‌లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉన్ని ముకుందన్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘నేను నటించిన సినిమాలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులందరూ కూర్చుని చూసేలా ఉండాలి. అందుకే.. సినిమాల్లోకి అడుగు పెట్టిన సమయంలోనే ముద్దు, ఇంటిమేట్ సీన్స్‌కు దూరంగా ఉండాలిని పాలసీ పెట్టుకున్నాను. అంతే కాదు.. ఎంతో మంది డైరెక్టర్లు (Directors), నిర్మాతలు (Producers) అలాంటి సీన్స్‌లో నటించాలని నాపై ఒత్తిడి తెచ్చేవారు. కానీ.. ఎంత ఒత్తిడి తెచ్చినా నేను కొన్నింటిని ఎప్పటికీ అంగీకరించనని వాళ్లకు క్లియర్‌గా చెప్పేవాడిని. ఒక జంట మధ్య రొమాన్స్ చూపించాలనుకుంటే.. ముద్దు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదనేది నా భావన. అలా అని నా తోటీ నటీనటులు అలాంటి సీన్స్ చేస్తే నేను తప్పుపట్టను. ఎందుకంటే.. ఆ పాలసీ నాకు నేను పెట్టుకున్నది.. అందుకే కట్టుబడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.






