- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Unni Mukundan: మానవ పరిణామంలో హింస ఒక భాగమే.. ‘మార్కో’ సినిమాపై ఉన్ని ముకుందన్ కామెంట్స్
మలయాళ (Malayalam) నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) రీసెంట్‌గా ‘మార్కో’ (Marco)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దిశ, సినిమా: మలయాళ (Malayalam) నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) రీసెంట్‌గా ‘మార్కో’ (Marco)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హనీఫ్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ (Action thriller)గా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 20 న థియేటర్‌లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ (box office) వద్ద ‘బేబీ జాన్’తో పోటీపడిన ఈ మూవీ కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది. అలాగే ఈ చిత్రంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉన్ని ముకుందన్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
‘మా సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి రికార్డులు సృష్టిస్తోంది. అలాంటి మూవీలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అనుకున్న దానిలో ఈ సినిమాను 30 శాతాన్ని మాత్రమే స్క్రీన్‌పైకి తీసుకురాగలిగాం. మేము హంసను ప్రోత్సహించాలనుకోవడం లేదు. అనుకున్న కథను ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా చెప్పాలి అనుకున్నాం. కానీ, మానవ పరిణామంలో హింస ఎల్లప్పుడూ భాగమే. ప్రజెంట్ డేస్‌లో ప్రపంచ సినిమాలో హింస, యాక్షన్ భాగమైంది. ప్రేక్షకులు కూడా అలాంటి తరహా చిత్రాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 1న తెలుగులో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది.






