కోచింగ్ సెంటర్‌లో పరిచయం..అలా పెళ్లి.. ఐబొమ్మ రవి ప్రేమపెళ్లిలో ఊహించని ట్విస్టులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-20 04:38:38  IST  )

ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో పోలీసుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రవి ప్రేమపెళ్లికి సంబంధించిన విషయాల్లో సినిమా రేంజ్ ట్విస్టులు కనిపిస్తున్నాయి.

కోచింగ్ సెంటర్‌లో పరిచయం..అలా పెళ్లి.. ఐబొమ్మ రవి ప్రేమపెళ్లిలో ఊహించని ట్విస్టులు
X

దిశ, వెబ్ డెస్క్: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో పోలీసుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రవి ప్రేమపెళ్లికి సంబంధించిన విషయాల్లో సినిమా రేంజ్ ట్విస్టులు కనిపిస్తున్నాయి. రవికి అమీర్ పేట కోచింగ్ సెంటర్లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే భార్య సోదరి విదేశాల్లో స్థిరపడటం, రవి చిన్నపాటి ఉద్యోగం చేయడంతో ఇద్దరి మధ్య సమస్యలు మొదయ్యాయి.

మనం కూడా మంచిగా స్థిరపడాలని భార్య ఒత్తిడి తేవడం, ఎగతాలి చేయడంతో ఇద్దరూ విడిపోయారు. తరవాత భార్య కూతురిని తీసుకుని వెళ్లిపోగా రవి ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ క్రమంలో త్వరగా డబ్బు సంపాదించాలి అనే దురాశతో పైరసీని మార్గంగా ఎంచుకున్నాడు. డబ్బులు భారీగా రావడంతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కలిసి విదేశాల్లో తిరుగుతూ కాలం గడిపేస్తున్నాడు. తన కూతురును చూడాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని పోలీసుల ఎదుట రవి వాపోయినట్టు తెలుస్తోంది.

Read More..

షాకింగ్.. IBOMMA మళ్లీ వచ్చేసింది!

Next Story