- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై వీడని సస్పెన్స్.. మెగా ఫ్యాన్స్‌లో మళ్లీ మొదలైన టెన్షన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మళ్లీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మళ్లీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్ అనుసరిస్తున్న తీరు ఇప్పుడు ఫ్యాన్స్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. నిన్నటి వరకు ఒక క్లారిటీ వచ్చిందని సంబరపడ్డ అభిమానులకు, నేటి పరిణామాలు మళ్లీ సందేహాలను మిగిల్చాయి. నిన్న ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడిన మాటలతో, ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాబోతోందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా మెగా ఫ్యాన్స్ ఏప్రిల్ 30 డేట్‌ను ట్రెండ్ చేస్తూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. దాదాపు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్టేనని అందరూ భావించారు.
హనుమాన్ జయంతి పోస్టర్‌లో మిస్సింగ్!
అయితే, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ది చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. సాధారణంగా రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో వచ్చే ఇలాంటి స్పెషల్ పోస్టర్లపై విడుదల తేదీని ప్రముఖంగా ప్రకటిస్తారు. కానీ, ‘పెద్ది’ తాజా పోస్టర్‌లో ఎక్కడా రిలీజ్ డేట్ ప్రస్తావన లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 30నే సినిమా వస్తుంటే, మేకర్స్ డేట్‌ను ఎందుకు ప్రకటించలేదు?.. ఇంకా ఏవైనా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయా?.. లేక రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందా? అనే సందేహాలు అభిమానుల్లో బలంగా వినిపిస్తున్నాయి. "ప్రతి పోస్టర్‌తోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కంటే, మేకర్స్ నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే బాగుంటుంది" అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలమాకు తెరపడాలంటే చిత్ర నిర్మాతలు వెంటనే ఒక అఫీషియల్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.






