ఆ సంఘటనతో ఆ హీరో మొఖం కూడా చూడొద్దు అనుకున్నాను… షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్

by Pulgam srinivas |   (  Updated:2026-05-04 12:34:32  IST  )

ఆ కారణంతో విశాల్ మొహం కూడా చూడొద్దు అనుకున్నట్లు సుందర్ సి చెప్పుకొచ్చాడు.

ఆ సంఘటనతో ఆ హీరో మొఖం కూడా చూడొద్దు అనుకున్నాను… షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుల్లో సుందర్ సి ఒకరు. ఈయన విశాల్ తో అనేక చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఒక దశలో ఆయన మొఖం కూడా చూడాలని అనిపించలేదని సుందర్ సి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుందర్ సి మాట్లాడుతూ… “కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన కారణంగా విశాల్ మొఖం కూడా చూడకూడదని అనుకున్నాను. కానీ కొంత కాలం తర్వాత ఓ ఫంక్షన్‌లో ఆయనను కలిశాను. అప్పట్లో జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాడు. ఆయనలోని నిజాయితీ నాకు బాగా నచ్చింది. దాంతో పాత విషయాలను మర్చిపోయాను” అని చెప్పుకొచ్చారు.

ఇక రజినీకాంత్ , కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన భారీ ప్రాజెక్ట్ (తలైవార్ 173) గురించి కూడా సుందర్ సి స్పందించారు. “మొదట ఈ సినిమాకు నన్నే దర్శకుడిగా అనుకున్నారు. నేను కూడా ఈ ఇద్దరు లెజెండ్స్‌తో సినిమా చేయాలని భావించాను. కానీ తర్వాత భయం వేసింది. ఇంత భారీ స్టార్‌డమ్ ఉన్న ఇద్దరు హీరోలను సమతుల్యం చేయడం సులభం కాదు. చిన్న తప్పు జరిగినా అభిమానులు అంగీకరించరని అనిపించింది. ప్రస్తుతం నా కెరీర్‌ను కూల్‌గా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తే దాని బరువు, బాధ్యతలను కూడా మోయాల్సి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేననే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను” అని సుందర్ సి వెల్లడించారు.

Next Story