హరి హర వీర మల్లు నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్.. ఆకట్టుకుంటున్న పవర్ స్టార్ లుక్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-01 15:23:55  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

హరి హర వీర మల్లు నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్.. ఆకట్టుకుంటున్న పవర్ స్టార్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు.

ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న గ్రాండ్‌గా థియేటర్లలో రాబోతుంది. అయితే ఈరోజు ఉగాది స్పెషల్‌గా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హ్యాండ్‌లో కత్తి పట్టుకుని ఉన్నాడు. అలాగే రెడ్ కలర్ షర్ట్, లుంగీ మెడ చుట్టూ బ్లాక్ కలర్ తువాలుతో దర్శనమిచ్చాడు.

ఇక రైట్ హ్యాండ్‌లో కడియం, పెద్ద మీసాలు టోటల్‌గా ఓ యుద్ధ వీరుడిలా కనిపిస్తున్నాడు. ఇక ఈపోస్టర్‌కు ‘ధర్మం కోసం యుద్ధం’ అనే క్యాప్షన్ కూడా జోడించారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ పోస్ట్‌తో క్యూరియాసిటీ పెంచేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story