- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Udaya Bhanu: అలాంటి వారికి స్టేజి మీదే ఇచ్చి పడేసిన ఉదయభాను
ఉదయభాను మాట్లాడుతూ... రాజీవ్ కనకాల గారు మీరు నన్ను వెనక్కి తిరిగి రెండు సార్లు చూశారు. దాన్ని కూడా కొంతమంది సంచలనం చేసేవారు మన సమాజంలో ఉన్నారు అని వ్యాఖ్యానించింది.

దిశ, వెబ్ డెస్క్: దాదాపు 20 సంవత్సరాల క్రితమే తెలుగులో యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఉదయభాను ఒకరు. ఈమె యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో ఆమె దరిదాపుల్లోకి కూడా వేరే వారు రాలేదు. అంతలా పాపులారిటీని సంపాదించుకున్న ఈ నటి ఆ సమయంలో చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. కేవలం ఉదయభాను యాంకరింగ్ పైనే దృష్టి పెట్టి అలాగే అనేక సంవత్సరాలు స్టార్ యాంకర్ గా కెరీర్ను కొనసాగించింది. ఇప్పటికీ కూడా ఉదయభానుకు మంచి గుర్తింపు ఉంది.
కొన్ని సంవత్సరాల క్రితం ఈమె పలు సినిమాలలో ఐటమ్ పాటలలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాల్లో కీలక, ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈ నటి D/O ప్రసాద్ రావు కనబడుటలేదు అనే వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సిరీస్లో ఉదయభాను పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుండడంతో దీని ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా ముఖ్య పాత్రలో నటించాడు.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు అద్భుతమైన రీతిలో ప్రేక్షకాదరణ దక్కుతుంది. కేవలం వారం రోజుల్లోనే దీనికి 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కినట్లు ఈ సంస్థ ప్రకటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ బృందం ఓ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అందులో ఉదయభాను, రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా రాజీవ్ కనకాల, ఉదయభానును రెండు సార్లు వెనక్కి తిరిగి చూశాడు. ఆ తర్వాత ఉదయభాను మీరు నన్ను రెండుసార్లు వెనక్కు తిరిగి చూశారు, దీన్ని కూడా కొంతమంది సంచలనం చేస్తారు. అలాంటి వారు కూడా మన సమాజంలో ఉన్నారు అని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






