- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Udaya Bhanu: ఆ క్యారెక్టర్‌లో ఉన్న కిక్ అలాంటిది.. ఉదయ భాను వైరల్ కామెంట్స్
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో రాబోతున్న మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’.

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో రాబోతున్న మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా.. సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కాబోతుండగా.. తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఉదయభాను తన పాత్రకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. చాలా రోజుల తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్ అని దీనికి ఒప్పుకున్నారా.. లేక ఈ రోల్ అయితే కరెక్ట్‌గా ఉంటుందని అంగీకరించారా అనే ప్రశ్నకు ఉదయ భాను స్పందిస్తూ..
‘అలా ఏం నేను డిజైన్ చేసుకోలేదు. నా ఫిలాసఫీ ఏంటంటే.. నా వరకు వచ్చిన పాత్ర.. అది మంచిది అయితే వదులుకోకూడదు. అలాగే నాకు నచ్చాలి. నచ్చకపోతే వదిలేస్తాను. దాని గురించి కూడా ఆలోచించను. నాకు ఈ పాత్ర గురించి చెప్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. ఒక పవర్ ఫుల్ ఉమెన్ పాత్ర ఇది. తను చూడగానే మొత్తం తన కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. నాకు ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒక లేడీ అయుండి ఇంతమంది మగవాళ్లను కంట్రోల్ చేయడం.. ఆ క్యారెక్టర్‌లో ఒక కిక్ ఉంది. ఆ కిక్ నాకు నచ్చింది. అందుకే కథ వినగానే ఓకే చెప్పేశా’ అంటూ తన పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది ఉదయ భాను.






