- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్వంభర నుండి ఒకేసారి రెండు అప్డేట్స్
చిరంజీవి ‘విశ్వంభర’ నుంచి సూపర్ అప్డేట్... ట్రైలర్ డేట్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ప్లాన్.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి – మల్లాడి వశిష్ట కాంబినేషన్‌లో చాలా రోజుల క్రితం ‘విశ్వంబర’ చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాను మొదటగా 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్‌లో ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం ఈ సమ్మర్‌లో కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ మూవీ యూనిట్ చాలా కాలం క్రితం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ వచ్చింది. అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న యూనిట్ మరో వీడియోను విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోవడంతో మెగా అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ మూవీ యూనిట్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు అప్డేట్లతో అభిమానులను ఆనందపర్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా ఫుటేజ్ మూవీ యూనిట్ చేతికి వచ్చినట్లు సమాచారం. దాంతో ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీతో పాటు రిలీజ్ డేట్‌ను ఒకేసారి అనౌన్స్ చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ‘విశ్వంభర’ మరోసారి వార్తల్లో నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా కనిపించనుండగా, ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.






