ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. మధ్యాహ్నం కుర్చుంటే సాయంత్రం వరకు అదే పనంటూ పోస్ట్

by I. Sairam |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత(Samantha), కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. మధ్యాహ్నం కుర్చుంటే సాయంత్రం వరకు అదే పనంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత(Samantha), కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. తమకంటూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇక వీరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ, పబ్, బీచ్, వెకేషన్ ఇలా ఏదైనా సరే ఎప్పుడు వీరు కలిసే కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ భామలు కలిసి మహానటి సినిమాలో నటించారు. అందులో సావిత్రిగా కీర్తి కనిపిస్తే.. ఆమె కథను ప్రపంచానికి తెలిపే జర్నలిస్ట్ మధురవాణిగా సమంత కనిపించింది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇప్పటివరకు స్నేహంగా కొనసాగుతూ వస్తుంది.

ఈ క్రమంలో తాజాగా సమంత ఇన్స‌స్టాగ్రామ్‌లో కీర్తి సురేష్‌తో పాటు దిగిన ఓ క్యూట్ ఫొటోను షేర్ చేసింది. ఇక దానికి 'లంచ్‌కు మధ్యాహ్నం కూర్చుంటే లేచే సరికీ సాయంత్రం అవుతుంది' అంటూ రాసుకొచ్చింది. అంటే ఈ స్నేహితులు ఇద్దరూ ఒకచోట కలిస్తే అంతా రచ్చ ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇద్దరు ముద్దుగుమ్మలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు టూ క్యూటీస్ ఇన్ సింగిల్ ఫ్రేమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Link

Next Story