- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి పాటకు బామ్మలు స్టెప్పులు !
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో పాటలన్నీ హిట్ ఆయన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హుక్ స్టెప్పు పాట మాత్రం బాగా పాపులర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది కూడా మన శంకర వరప్రసాద్ గారే. ఈ సినిమా 300 కోట్ల వైపు దూసుకు వెళ్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయగా నయనతార హీరోయిన్ అవతారం ఎత్తారు. అటు విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 20 నిమిషాల పాటు సినిమాలో సందడి చేశారు విక్టరీ వెంకటేష్.
చిరంజీవి పాటకు స్టెప్పులు వేసిన బామ్మలు
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో పాటలన్నీ హిట్ ఆయన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హుక్ స్టెప్పు పాట మాత్రం బాగా పాపులర్ అయింది. అయితే ఈ పాటకు ఇద్దరు బామ్మలు డాన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తరహాలో మొబైల్ లైట్ పెట్టుకొని మరీ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.






