- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కై మూవీ నుంచి నిను కసిరిన సమయాన సాంగ్ రాబోతుందంటూ ట్వీట్..
మురళీ కృష్ణంరాజు(Murali Krishnam Raju), శృతి శెట్టి(Shruti Shetty) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘స్కై’(Sky).

దిశ, వెబ్‌డెస్క్: మురళీ కృష్ణంరాజు(Murali Krishnam Raju), శృతి శెట్టి(Shruti Shetty) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘స్కై’(Sky). వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పేరిచర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మాణంలో పృథ్వీ పేరిచర్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ఓ సాంగ్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి నిను కసిరిన సమయాన అనే సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘హృదయాలు చెప్పలేనిది మాట్లాడే మెలోడి.. స్కై నుండి నిను కసిరిన సమయాన అనేది స్వచ్ఛమైన మాయాజాలం రేపు ఉదయం 11:11 గంటలకు పూర్తి పాట విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా స్కై మూవీ ఫిబ్రవరి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది.






