Vijay Antony: ‘VA-26’ నుంచి బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయంటూ ట్వీట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-17 11:51:29  IST  )

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) గత ఏడాది ‘రోమియో’(Romeo) చిత్రంతో వచ్చి హిట్ అందుకున్నారు.

Vijay Antony: ‘VA-26’ నుంచి బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయంటూ ట్వీట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) గత ఏడాది ‘రోమియో’(Romeo) చిత్రంతో వచ్చి హిట్ అందుకున్నారు. అదే ఫామ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విజయ్ ఆంటోని ‘మార్గన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లియో జాన్ పాల్(Leo John Paul) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిల్మ్స్ బ్యానర్‌పై మీరా ఆంటోని నిర్మిస్తోంది. ఈ మూవీతోనే విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్‌ విలన్‌గా పరిచయం కాబోతున్నాడు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతుంది.

అయితే ఇందులో బ్రిగిడా, వినోద్ సాగర్, కనిమొళి, ప్రితిక, మహానటి శంకర్, సముద్రఖని(Samuthirakani), దిప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, విజయ్ ఆంటోని మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. జోషు సేతురామన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. అయితే VA-26 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని విజయ్ భార్య నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మే 19న సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతున్నట్లు విజయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా న్యాయానికి పేరు ఉందంటూ ఓ రూ. 100 బాండ్ పేపర్ మంటల్లో కాలిపోతున్న పోస్టర్‌ను షేర్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు.

Next Story