- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ ట్వీట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) సరసన రష్మిక నటిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్(Geetha Arts), మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా ఈమూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ‘సంగీతం మీ ఆత్మను తాకగలదని వారు చెప్పినప్పుడు, వారి ఉద్దేశ్యం ఇదే.. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకు రాబోతుంది అని మూవీటీమ్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఫస్ట్ సింగిల్ పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. Link






